విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 2025-26 విద్యాసంవత్సరానికి ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
వెబ్ బేస్డ్ ఎంటెక్ (డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) ప్రోగ్రామ్: 30 సీట్లు
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-06-2025.
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీలు: 30.06.2025.
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 01 జులై 2025.
తరగతుల ప్రారంభం: 12 ఆగస్టు 2025.
Website:https://www.iipe.ac.in/Academics/phdapplication.php
Apply online:https://erp.iipe.ac.in/IIPEApp/index