ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్‌పుర్‌లోని ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రిసెర్చ్ (ఐఐపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రిసెర్చ్ ఫెలో- 01
ప్రాజెక్ట్ అసిస్టెంట్- 01
అర్హత: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్/ గేట్/ ఐసీఏఆర్-ఎస్‌ఆర్‌ఎఫ్ స్కోర్, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.15,000.
వయోపరిమితి: సీనియర్ రిసెర్చ్ ఫెలోకు 18- 35 ఏళ్లు; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు 21- 45ఏళ్లు ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 17.03.2025.
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్వ్యూ వేదిక: ఐసీఏఆర్- ఐఐపీఆర్ రీజినల్ స్టేషన్, ఫాండా (టోల్ ప్లాజా దగ్గర) భోపాల్.
Website:https://iipr.icar.gov.in/