ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ 2026 సంవత్సరానికి గానూ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలను ప్రకటించింది. సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్ (ఎస్‌యూఆర్‌ఈ) కింద రెండు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు ప్రతిభావంతులైన విద్యార్థులకు పరిశోధన, సాంకేతిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
వివరాలు:
ఈ ఏడాది మొత్తం 250 మంది ఇంటర్న్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా 100 సీట్లను ప్రత్యేకంగా బాలికలకే కేటాయించారు.
ఎంపికైన అభ్యర్థులకు కనీసం నెల రోజుల పాటు ఇంటర్న్‌గా చేయాల్సి ఉంటుంది.
మొత్తంగా రెండు నెలల ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి రూ.15,000 చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. నెల రోజుల పాటు చేస్తే రూ.7500, నెలన్నర పాటు చేస్తే రూ.10వేలు చొప్పున చెల్లిస్తారు.
అర్హతలు:
ఈ అవకాశం కేవలం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు కాని వారికి (Non-IITH) మాత్రమే.
ఎమ్మెస్సీ(మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ), ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు బీటెక్ /బి.డిజైనింగ్ రెండు, మూడో సంవత్సరం (అన్ని బ్రాంచ్‌లు) లేదా ఇంటిగ్రేటెడ్ బీటెక్/ఎంటెక్ మూడు/నాలుగో సంవత్సరం చదువుతున్న వారు.
దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థులు తమ మునుపటి ఏడాదిలో సాధించిన సీజీపీఏ లేదా పర్సెంటేజ్ స్కోరు ఆధారంగా ఈ ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు. అలాగే, దరఖాస్తు సమయంలో సంబంధిత విద్యాసంస్థ హెడ్/ప్రిన్సిపల్ ధ్రువీకరణ తప్పనిసరి. మొదటి 20 శాతం (Top 20%) మెరిట్ జాబితాలో ఉండాలి.
కాలపరిమితి, వసతి:
ఇంటర్న్‌షిప్ మే 15, 2026 నుంచి జులై 14 మధ్య (ఒకటి లేదా రెండు నెలలు) ఉంటుంది. ఎంపికైన వారికి ఐఐటీ క్యాంపస్‌లోని హాస్టళ్లలో వసతి కల్పిస్తారు. అయితే మెస్ ఖర్చులను విద్యార్థులే భరించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఫుల్‌టైం/రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం. అకడమిక్ పర్ఫార్మెన్స్, ఇతర పోటీ పరీక్షలు (ఒలింపియాడ్స్, ఎన్‌టీఎస్‌ఈ), ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు కేవలం ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి సమాచారం: ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు కేవలం ఈమెయిల్ (Email) ద్వారా మాత్రమే సమాచారం అందిస్తారు. అభ్యర్థుల తుది జాబితాను ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌లోని 'SRC Office' వెబ్‌పేజీలో ఉన్న 'News/Announcement' విభాగంలో కూడా చూడవచ్చు.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ: 10.03.2026.
ఫలితాల ప్రకటన (SRC వెబ్‌సైట్‌లో): 15.04.2026 (తాత్కాలిక)
కార్యక్రమం ప్రారంభం: 15.05.2026
Website:https://www.iith.ac.in/news/2026/02/27/Summer-Undergraduate-Research-Exposure/