Published on Oct 26, 2024
Government Jobs
ఐఐటీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఐఐటీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2

3. అసోసియేట్ ప్రొఫెసర్

4. ప్రొఫెసర్

విభాగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & మేనేజ్‌మెంట్, లిబరల్ ఆర్ట్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ & ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ & ఇంజినీరింగ్, ఫిజిక్స్‌, డిజైన్.

అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పారిశ్రామిక/ పరిశోధన/ బోధనలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.101500, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.98200. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,39,600. ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,59,100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 01.11.2024.

Website:https://iith.ac.in/