ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూపార్ ఫ్యాకల్టీ ఫెలో, సీనియర్ మేనేజర్, స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. ఫ్యాకల్టీ ఫెలో: 05
2. సీనియర్ మేనేజర్(మార్కెటింగ్): 01
3. మేనేజర్ ఫుల్ స్టాక్ డెవలపర్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఫ్యాకల్టీ ఫెలో పోస్టులకు 55 ఏళ్లు, మిగతా పోస్టులకు 45 ఏళ్ల లోపు ఉండాలి.
వేతనం: నెలకు ఫ్యాకల్టీ ఫెలోకు రూ.1,50,000, మిగతా పోస్టులకు సంవత్సరానికి రూ.7 నుంచి రూ.9 లక్షలు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 11.