పంజాబ్ రాష్ట్రం రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ (ఐఐటీ రోపర్), డైరెక్ట్ / డిప్యుటేషన్ / కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ బోధనేతర పోస్టుల నియామకాలను దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
వివరాలు:
1. డిప్యూటీ లైబ్రేరియన్: 01
2. మెడికల్ ఆఫీసర్: 01
3. అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ప్లేస్‌మెంట్): 01
4. టెక్నికల్ ఆఫీసర్: 02
5. సెక్యూరిటీ ఆఫీసర్: 01
6. కౌన్సెలర్: 01
7. జూనియర్ సూపరింటెండెంట్: 01
8. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 01
9. అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్: 01
10. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 01
11. జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 01
12. జూనియర్ అసిస్టెంట్: 04
13. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్: 15
అర్హత: అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ/ డిప్లొమా అర్హతలను కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్లలో ప్రావీణ్యం, డొమైన్-నిర్దిష్ట నైపుణ్యాలు తప్పనిసరి.
జీతం: నెలకు రూ.21,700- రూ.2,11,500.
ఎంపిక విధానం: రాత/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500 (పోస్టులు 01 నుంచి 06 వరకు), రూ.250 (పోస్టులు 07 నుంచి 13 వరకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.07.2025.