Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 24, 2026
Admissions
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (ఐఐఐటీఎం) 2026 విద్యాసంవత్సరానికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్‌ను ప్రారంభించింది. డేటా ఆధారితంగా విశ్లేషణాత్మక నైపుణ్యాలతో పాటు నిర్వహణ పరిజ్ఞానం అందించడం ద్వారా కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తు అవసరాలకు మానవవనరులను తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్‌ ప్రధాన లక్ష్యం.

వివరాలు:

బీఎస్‌ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్) 

అర్హతలు: ఇంటర్మీడియట్‌, డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతలు ఉండాలి.

మొదటి బ్యాచ్‌ జూన్‌ 2026లో ప్రారంభమవుతాయి. మే 30 వరకు రిజిస్ట్రేషకు చేసుకునేందుకు అవకాశం ఉంది. వయోపరిమితి, సీట్ల పరిమితి లేదు.

ఈ ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన అనంతరం కన్సల్టింగ్‌ - ఫైనాన్స్‌, టెక్నాలజీ, మ్యానుఫాక్చరింగ్‌, హెల్త్‌కేర్‌, పాలసీ తదితర రంగాల్లో అద్భుతమైన ఉద్యోగవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30.05.2026.

Website:https://study.iitm.ac.in/mg/