Published on Apr 17, 2025
Government Jobs
ఐఐటీ మద్రాస్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టులు
ఐఐటీ మద్రాస్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 22

వివరాలు:

1. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01

2. డిప్యూటీ రిజిస్ట్రార్‌: 02

3. టెక్నికల్ ఆఫీసర్‌: 01

4. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 02

5. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్‌: 01

6. జూనియర్‌ సూపరింటెండెంట్‌: 05

7. జూనియర్‌ అసిస్టెంట్: 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, టెక్నికల్ ఆఫీసర్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు 45 ఏళ్లు, జేటీఎస్‌, జేఎస్‌ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్‌ అసిస్టెంట్‌కు 27 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫెషనల్ కాంపెటెన్స్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2025 ఏప్రిల్ 19.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 19.

Website:https://recruit.iitm.ac.in/