వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీహెచ్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ /సైంటిస్ట్, రిసెర్చ్ అసోసియేట్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 06
వివరాలు:
1. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / సైంటిస్ట్ - 01
2. రిసెర్చ్ అసోసియేట్ - 03
3. అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ - 02
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ,పీజీ/పీహెచ్‌డీ(సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, ప్లానింగ్/ ఎన్విరాన్మెంట్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ కు రూ.54,000 - రూ.1,00,000. రిసెర్చ్ అసోసియేట్ కు రూ.47,000.- రూ.65,500. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.25,000 - రూ.42,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 17-02.2026.