Published on Jan 17, 2026
Government Jobs
ఐఐటీ దిల్లీలో రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ (ఐఐటీ దిల్లీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 17

వివరాలు:

1.ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-II : 09 

2.ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-III : 02 

3.ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III : 06

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 75 శాతం మార్కూలతో ఎమ్మెస్సీ/ఎంటెక్/ ఎంబీఏ(పర్యావరణ/వాతావరణ శాస్త్రాలు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, పబ్లిక్ హెల్త్ లేదా ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-IIకు రూ.67,000.ప్రాజెక్ట్ రిసెర్చ్  సైంటిస్ట్-III కు రూ.78,000. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-IIIకు రూ.28,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా sagnik@cas.iitd.ac.in కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 30, 

Website: https://ird.iitd.ac.in/current-openings