Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 9, 2025
Government Jobs
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు

దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ దిల్లీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 05

వివరాలు:

1. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 02

2. ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌ /ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ కు రూ.75,600 -  రూ. 1,01,610. ప్రాజెక్ట్ సైంటిస్ట్ కు రూ.47,790 - రూ. 62,350.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా bsy247586@dbst.iitd.ac.in కు పంపాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 19-12-2025.

Website:https://ird.iitd.ac.in/current-openings