Published on Mar 18, 2025
Admissions
ఐఐటీ తిరుపతిలో ప్రవేశాలు
ఐఐటీ తిరుపతిలో ప్రవేశాలు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎంఎస్‌ అండ్ పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు: 

మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్ బై రిసెర్చ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (ఎంఎస్ (ఆర్‌)) 

డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ ఇన్ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్ సైన్స్‌ (పీహెచ్‌డీ)

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్‌, ఎంస్‌, బీటెక్‌, ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు గేట్‌/ యూజీసీ నెట్‌/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ ఎన్‌డీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌/ జేయూఎస్‌టీ వ్యాలీడ్‌ స్కోర్‌ ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ పురుష అభ్యర్థులకు రూ.400; మహిళా అభ్యర్థులకు రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక విధానం: విద్యార్హతలు, స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-04-2025.

Website:https://www.iittp.ac.in/ph-d-admission

Apply Onine:https://iittp.plumerp.co.in/prod/iittirupati/phdapplication