ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 26
2. డిప్లొమా అప్రెంటిస్: 14
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, జీఎన్‌ఎం, బీఈ/బీటెక్, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.20,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.18,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2026, మార్చి 27, 28, 29.