Published on Dec 24, 2025
Government Jobs
ఐఐటీ గువాహటిలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు
ఐఐటీ గువాహటిలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్ , అసిస్టెంట్ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 06

వివరాలు:

1. రిసెర్చ్ అసిస్టెంట్ -04

2. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ - 02

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీ(సోషల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ హెల్త్ లేదా కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రిసెర్చ్‌ అసిస్టెంట్ కు రూ.37,000. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కు రూ.20,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 02-01-2026.

Website:https://www.iitg.ac.in/iitg_reqr?ct=ZHBsTmd0Y0VWdkJTRzU0ZU92bHAwdz09