Published on Jan 2, 2025
Government Jobs
ఐఐటీ గాంధీనగర్‌లో పోస్టులు
ఐఐటీ గాంధీనగర్‌లో పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ (ఐఐటీజీఎన్‌) డైరెక్ట్ లేదా డిప్యుటేషన్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

లైబ్రేరియన్: 1 పోస్టు

సూపరింటెండింగ్ ఇంజినీర్: 1 పోస్టు

అర్హత: 

లైబ్రేరియన్: అభ్యర్థులు తప్పనిసరిగా పీహెచ్‌డీ కలిగి ఉండాలి. లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో లేదా కనీసం 55% మార్కులతో అదే విభాగంలో మాస్టర్స్ డిగ్రీ. వీరికి డిప్యూటీ లైబ్రేరియన్‌గా 10 ఏళ్ల అనుభవం ఉండాలి.

సూపరింటెండింగ్ ఇంజినీర్: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా 7 సంవత్సరాలతో సహా 12 సంవత్సరాల అనుభవంతో బీఈ/బీటెక్‌ డిగ్రీ ఉండాలి.

వయస్సు:

లైబ్రేరియన్: దరఖాస్తు చివరి తేదీ నాటికి 57 ఏళ్లు; సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు 50 ఏళ్లు మించకూడదు.

జీతం:

లైబ్రేరియన్: రూ.1,44,200 - రూ.2,18,200; సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు రూ.1,23,100 - రూ.2,15,900.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-01-2025.

Website:https://iitgn.ac.in/careers