Published on Jan 24, 2025
Government Jobs
ఐఐటీ కాన్పూర్ లో టెక్నికల్ పోస్టులు
ఐఐటీ కాన్పూర్ లో టెక్నికల్ పోస్టులు

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీకే) వివిధ విభాగాల్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 34

వివరాలు:

1. సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఎస్ఈ): 01

2. సూపరింటెండెంట్ ఇంజినీర్(డీసీఈ & డీఈఈ): 02

3. డిప్యూటీ రిజిస్ట్రార్: 02

4. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీసీఈ & డీఈఈ): 02

5. అసిస్టెంట్ కౌన్సిలర్: 03

6. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01

7. అసిస్టెంట్ రిజిస్ట్రార్(లైబ్రరీ): 01

8. హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్: 01

9. మెడికల్ ఆఫీసర్: 02

10. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్( ఫర్ ఉమెన్): 02

11. అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్: 02

12. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, డీన్ ఆఫ్‌ అకడెమిక్ అఫైర్స్): 03

13. జూనియర్ అసిస్టెంట్: 12

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ( సివిల్, ఎలక్ట్రికల్), ఎంఫీల్( క్లినికల్ సైకాలజీ), హోటల్ మేనేజేమెంట్, ఎంబీబీఎస్, డిగ్రీ(బీపీఈడి), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులకు 57 ఏళ్లు; డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుకు 21 - 50 ఏళ్లు; అసిస్టెంట్ కౌన్సిలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్(లైబ్రరీ), హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 21 - 45 ఏళ్లు; అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్( ఫర్ ఉమెన్), అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు 21 - 35 ఏళ్లు; . జూనియర్ అసిస్టెంట్ కు 21 - 30 ఏళ్లు.

జీతం: నెలకు సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కు రూ.1,31,100 - రూ. 2,16,600; సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టుకు రూ.1,23,100 - రూ.2,15,900; డిప్యూటీ రిజిస్ట్రార్ కు రూ.78,800 - రూ.2,09,200; ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుకు రూ.67,700 - రూ. 2,08,700; అసిస్టెంట్ కౌన్సిలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్(లైబ్రరీ), హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100 - రూ.1,77,500; అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్( ఫర్ ఉమెన్), అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.35,400 - 1,12,400; జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,700 - రూ.69,100.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2025.

Website:https://www.iitk.ac.in/new/recruitment