Published on Sep 21, 2024
Government Jobs
ఐఐటీ ఇందౌర్‌లో టీచింగ్ పోస్టులు
ఐఐటీ ఇందౌర్‌లో టీచింగ్ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ ఇందౌర్ (ఐఐటీఐ) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (గ్రేడ్‌- I & II) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 26

వివ‌రాలు:

విభాగాలు: ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌, స్పేస్‌ ఇంజినీరింగ్‌, బయోసైన్స్‌ అండ్‌ బయోమెడికల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్‌, స్కూల్ ఆఫ్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్ సైన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ తదితరాలు.

అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌-I పోస్టుకు రూ.1,81,320; అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌-II పోస్టుకు రూ.1,29,912.

వయోపరిమితి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌-I పోస్టుకు 35 ఏళ్లు; అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌-II పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 01-10 2024.

Website:https://www.iiti.ac.in/