ఇండోర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
వివరాలు:
1. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 01
2. మెడికల్ ఆఫీసర్: 01
3. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01
4. సీనియర్ ఇంజినీర్: 01
5. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 01
6. జూనియర్ సూపరింటెండెంట్: 02
7. జూనియర్ అసిస్టెంట్: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీటెక్(సివిల్)/ఎండీ/ఎంఎస్/ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్), మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు 45 ఏళ్లు, సీనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్ కు 40 ఏళ్లు, జూనియర్ అసిస్టెంట్ కు 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు రూ.67,700 - రూ.2,08,700; మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.56,100 - రూ.1,77,500; సీనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ రూ.44,900 - రూ.1,42,400; జూనియర్ సూపరింటెండెంట్ కు రూ.35,400 - రూ.1,12,400; జూనియర్ అసిస్టెంట్ రూ.25,500 - రూ.81,100.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-01-2025.
Website:https://www.iiti.ac.in/recruitments/non-teaching-recruitment