Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 27, 2026
Current Affairs
ఐఐటీహెచ్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం
ఐఐటీహెచ్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం
  • ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది. కృత్రిమ మేధ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ), మైనింగ్‌ 4.0 ఫ్రేమ్‌ వర్క్, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, వాహనాలపై నిఘా లాంటి అత్యాధునిక సాంకేతికతను ఖనిజాల పరిశోధనలు, తరలింపులో ఉపయోగించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ రెండు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.
  • ఇనుప ఖనిజ శుద్ధి, అగ్లోమరేషన్‌ రంగాల్లోనూ ఎన్‌ఎండీసీ, ఐఐటీ కలిసి పరిశోధనలు చేస్తాయి. ఐఐటీ హైదరాబాద్‌ డైరక్టర్‌ బి.ఎస్‌.మూర్తి సమక్షంలో ఎన్‌ఎండీసీ, ఐఐటీ ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.