- అంతరిక్ష సాంకేతికత, సెమీకండక్టర్లు, రక్షణ సాంకేతికత లాంటి వ్యూహాత్మక రంగాల్లోని ప్రారంభ స్థాయి అంకుర సంస్థలకు తోడ్పాటు అందించే ఉద్దేశంతో రూ.600 కోట్ల డీప్‌టెక్ నిధిని ఐఐటీ మద్రాస్ రిసెర్చ్ పార్క్, యూనికార్న్ ఇండియా వెంచర్స్ ఏర్పాటు చేశాయి. ‘ఐఐటీఎం యూనికార్న్ ఫ్రంటియర్ ఫండ్- 1’గా వ్యవహరించే ఈ నిధికి అవసరాన్ని బట్టి అదనంగా మరో రూ.400 కోట్లు జతచేసే అవకాశం ఉందని రెండు సంస్థలు ప్రకటించాయి.
- జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలతో సంబంధమున్న డీప్‌టెక్ (ఐపీ ఆధారిత, ఇంజినీరింగ్ హెవీ) రంగాల్లోని సంస్థలకు సాయం చేయడంపై ఈ నిధి దృష్టి పెడుతుంది. మొత్తంగా 25 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్నది లక్ష్యం.