పుణెలోని భారత ఉష్ణ మండల వాతావరణ విజ్ఞాన సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటీయరాలజీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 55
వివరాలు:
ప్రాజెక్ట్ సైంటిస్ట్-III - 03
ప్రాజెక్ట్ సైంటిస్ట్-II - 05
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I - 09
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ - 01
ప్రాజెక్ట్ అసోసియేట్-II: 02
ప్రాజెక్ట్ అసోసియేట్-I: 32
ప్రాజెక్ట్ మేనేజర్- 01
ప్రాజెక్ట్ కన్సల్టెంట్- 01
ప్రోగ్రామ్ మేనేజర్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్-III, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.78,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIకు రూ67,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్-I రూ.56,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.28,000; ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు రూ.25,000; ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.1,25,000.
వయోపరిమితి: పోస్టును అనుసరించి 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-12-2024.
Website:https://www.tropmet.res.in/