Published on Jun 15, 2025
Government Jobs
ఐఐటీఎంలో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు
ఐఐటీఎంలో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్ మెటీరియోలజీ (ఐఐటీఎం) రిసెర్చ్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

1. రిసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ): 10

2. రిసెర్చ్‌ ఫెలో(ఆర్‌ఎఫ్): 20 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ, నెట్‌, గేట్‌, జెస్ట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 2025 జూన్‌ 30వ తేదీ నాటికి ఆర్‌ఏకు 35 ఏళ్లు, ఆర్‌ఎఫ్‌కు 28 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు ఆర్‌ఏకు రూ.58,000, ఆర్‌ఎఫ్‌కు రూ.37,000. 

దరఖాస్తు ఫీజు: ఫీజు లేదు (ఉచిత దరఖాస్తు)

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30 జూన్ 2025.

Website: https://tropmet.res.in/Careers