Published on Jan 2, 2026
Government Jobs
ఐఐఐటీ పుణెలో అసోసియేట్ ఉద్యోగాలు
ఐఐఐటీ పుణెలో అసోసియేట్ ఉద్యోగాలు

పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 09

వివరాలు:

1. నేషనల్ పోస్ట్-డాక్టోరల్ ఫెలో  - 02    

2. జూనియర్ రీసెర్చ్ ఫెలో  - 02

3. సీనియర్ రీసెర్చ్ ఫెలో     - 01

4. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ -01

5. సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్     - 01

6. ప్రాజెక్ట్ అసోసియేట్-I    - 01

7. ఫీల్డ్ అసిస్టెంట్    - 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌ /ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్, ఐటి, సైబర్ సెక్యూరిటీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  

జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.1,50,000. ఎన్‌పీడీఎఫ్‌కు రూ. 80,000.  ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.67,000. ఎఆర్‌ఎఫ్‌కు రూ.42,000. జేఆర్ఎఫ్‌కు రూ.37,000. ఫీల్డ్‌ అసిస్టెంట్ కు రూ.27,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 14-01-2026.

Website:https://iiitp.ac.in/careers