Published on Jun 19, 2025
Government Jobs
ఐఐఎం ముంబయిలో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు
ఐఐఎం ముంబయిలో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ ముంబయి (ఐఐఎం) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌, ప్రొఫెషనల్ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-1, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీల సంఖ్య: 22

వివరాలు:

1. జూనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌: 03

2. ప్రొఫెషనల్ అసిస్టెంట్: 01

3. జూనియర్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-1: 02

4. జూనియర్ అసిస్టెంట్: 06

5. జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-1: 05

6. జూనియర్ ఎగ్జిక్యూటివ్‌: 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: జూనియర్ ప్రోగ్రామ్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు, జూనియర్ ఎగ్జి్క్యూటివ్‌కు 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు జూనియర్ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ రూ.44,900 - రూ.1,42,400, ప్రొఫెషనల్ అసిస్టెంట్‌కు రూ.35,400 - రూ.1,12,400, జూనియర్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-1కు రూ.29,200 - రూ.92,300, జూనియర్ అసిస్టెంట్ రూ.25,500 - రూ.81,100, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-1కు రూ.21,700 - రూ.69,100, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.19,900 - రూ.63,200.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 13.

Website:https://iimmumbai.ac.in/careers