Published on Jan 3, 2025
Government Jobs
ఐఐఎస్‌టీలో ఇంజినీర్ పోస్టులు
ఐఐఎస్‌టీలో ఇంజినీర్ పోస్టులు

భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), ఇంజినీర్‌ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 4

వివరాలు:

ఇంజనీర్ (సివిల్)- 3 పోస్టులు

ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1 పోస్టు

అర్హతలు: సివిల్స్‌/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ లేదా తత్సమాన విద్యార్హతో పాటు కనీసం 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.01.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.40,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను వ్రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025.

Website:https://www.iist.ac.in/