తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఆగస్టు 2025లో ప్రారంభమయ్యే పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీహెచ్‌డీ ప్రోగ్రామ్- ఆగస్టు 2025
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అర్హతలు: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో పీజీతో పాటు జేజీఈఈబీఐఎల్‌ఎస్/ డీబీటీ- జేఆర్‌ఎఫ్-ఎ/ ఐసీఎంఆర్- జేఆర్‌ఎఫ్/ డీబీటీ- బీఐఎన్‌సీ/ యూజీసీ- సీఎస్‌ఐఆర్ జేఆర్‌ఎఫ్/ సీఎస్‌ఐఆర్/ యూజీసీ- ఎల్‌ఎస్/ జేఆర్ఎఫ్/ గేట్/ ఇన్‌స్పైర్ పీహెచ్‌డీ/ జెస్ట్/ నెట్ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2025.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన తేదీలు: నవంబర్ 11-15, 2024.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 01 - 07, 2025.
ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడి: జూన్ 10-15, 2025.
ప్రవేశ తేదీ: ఆగస్టు 04, 2025.