Published on Dec 27, 2025
Government Jobs
ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతిలో ఉద్యోగాలు
ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతిలో ఉద్యోగాలు

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 22

వివరాలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 01

2. మెడికల్ ఆఫీసర్: 01

3. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01

4. నర్స్: 01

5. ప్రైవేట్ సెక్రటరీ: 01

6. సూపరింటెండెంట్: 02

7. టెక్నికల్ అసిస్టెంట్ : 04

8. జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్: 01

9. జూనియర్ ట్రాన్స్‌లేటర్: 07

10. ల్యాబ్ అసిస్టెంట్ (బయాలజీ): 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎంబీబీఎస్‌/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ ఓబీసీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 02-02-2026.

Website:https://www.iisertirupati.ac.in/jobs/?search_keywords=&selected_category=pa-pf&selected_jobtype=-1&selected_location=-1