Published on Dec 7, 2024
Government Jobs
ఐఐఎఫ్‌సీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు
ఐఐఎఫ్‌సీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సీఎల్‌)  రెగ్యులర్‌ ప్రాతిపదికన గ్రేడ్‌-ఏ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40

వివరాలు: 

విభాగాలు: ప్రాజెక్ట్‌ ఫైనాన్సింగ్‌, స్ట్రెస్‌డ్‌ అసెట్‌ మేనేజిమెంట్‌, అకౌంట్స్‌,  రిసోర్స్‌ అండ్‌ ట్రెజరీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లీగల్‌, సెక్రటేరియల్‌ ఫంక్షన్స్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ సేఫ్‌గార్డ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొక్యూర్‌మెంట్‌, హ్యుమన్‌ రిసోర్స్‌, రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌,  రాజ్‌భాష, కంప్లైన్స్‌ అండ్‌ ఆడిట్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌,  జనరల్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఏ, సీఏ, సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

బేసిక్‌ పే స్కేల్‌: నెలకు రూ.44,500.

వయోపరిమితి: నవబంర్‌ 30, 2024 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

పరీక్ష సెంటర్‌: దేశంలోని ప్రధాన నగరాల్లో.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రూ.100; ఇతరులు రూ.600.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23-12-2024.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జనవరి 2025.

ఇంటర్వ్యూ తేదీ: జనవరి/ ఫిబ్రవరి

Website:https://www.iifcl.in/