ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బి.పి. కనుంగో నియమితులయ్యారు. 2025, డిసెంబరు 20న జరిగిన బోర్డు సమావేశంలో ఈయన నియామకానికి ఆమోదం లభించింది. కనుంగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్. పరపతి విధానం, ఆర్థిక నియంత్రణలు, కేంద్ర బ్యాంకింగ్ వంటి అంశాల్లో ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.