హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐకార్)కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
1. సీనియర్ రిసెర్చ్ ఫెలో/ యంగ్ ప్రొఫెషనల్-2: 07
2. యంగ్ ప్రొఫెషనల్-1: 02
అర్హత: ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: ప్లాంట్ బ్రీడింగ్, బయో టెక్నాలజీ, బయాలజీ, బయో కెమిస్ట్రీ, సీడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, న్యూట్రిషన్ తదితరాలు.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్-1 పోస్టులకు రూ.30,000; సీనియర్ రిసెర్చ్/ యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టులకు రూ.37,000-రూ.42,000.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
వేదిక: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీ: 05-11-2024.
Website:https://www.millets.res.in/