Published on Dec 18, 2024
Walkins
ఐఐఎంఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు
ఐఐఎంఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 6

వివరాలు: 

యంగ్‌ ప్రొఫెషనల్‌-I- 03

యంగ్‌ ప్రొఫెషనల్‌-II- 03

అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్‌, పీజీ, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ/ పీజీడీఆర్‌డీ, పీజీడీఏబీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-I పోస్టుకు రూ.42,000; యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు రూ.30,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక  విధానం: అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈ మెయిల్‌ ద్వారా డిసెంబర్‌ 30 వరకు పంపించాలి.

ఈమెయిల్‌:iimrscsptsp@gmail.com

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: 03-01-2025.

Website:https://www.millets.res.in/