భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా చేపట్టిన తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్) పరీక్ష విజయవంతమైంది. 2025, ఆగస్టు 24న ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగినట్లు రక్షణశాఖ తెలిపింది. ఏఐడీడబ్ల్యూఎస్ అనేది శత్రు క్షిపణులు, యుద్ధవిమానాలు, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. ఇందులో మూడు భిన్న ఆయుధాలు ఉన్నాయి.
1. ఉపరితలం నుంచి గగనతలంలోకి వేగంగా దూసుకెళ్లే క్షిపణి (క్యూఆర్‌శామ్)
2. స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ (వీఎస్‌హెచ్‌ఓఆర్‌ఏడీఎస్)
3. లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధ (డీఈడబ్ల్యూ) వ్యవస్థ