దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( ఐఏఎస్‌ఆర్‌ఐ) ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్: 02
2. ఐటీ ప్రొఫెషన్-IV: 01
3. సీనియర్ రిసెర్చ్ ఫెలో: 03
4. యంగ్ ప్రొఫెషనల్-I: 01
5. ఆఫీస్-కమ్-ల్యాబ్ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు, నెట్/ గేట్ స్కోర్, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ రూ.61,000, ఐటీ ప్రొఫెషన్‌కు రూ.60,000; సీనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000; యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.30,000; ఆఫీస్-కమ్-ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.25,000.
వయోపరిమితి: పోస్టును అనుసరించి 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.3.2025