దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
1. సీనియర్ రిసెర్చ్ ఫెలో: 02
2. యంగ్ ప్రొఫెషనల్-1: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణతతో పాటు, నెట్/ గేట్ స్కోర్, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ రిసెర్చ్ ఫెలోకు మొదటి, రెండో ఏడాది రూ.37,000, రెండో ఏడాది రూ.42,000; యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.30,000.
వయోపరిమితి: సీనియర్ రిసెర్చ్ ఫెలోకు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు; యంగ్ ప్రొఫెషనల్‌కు 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా మార్చి 11వ తేదీ వరకు పంపించవచ్చు.
ఈమెయిల్:viromeacpv@gmail.com
ఇంటర్య్వూ తేదీ: 13.03.2025.
వేదిక: ఐసీఏఆర్-ఐఏఆర్‌ఐ, న్యూ దిల్లీ.