భారత వ్యోమగామి శుభాంశు శుక్లా 2025, మే 29న రోదసియాత్ర చేయనున్నారు. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్‌లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పయనం కానున్నారు. ఈ యాత్రలో శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) కూడా పాలుపంచుకుంటారు. వీరు రెండు వారాలపాటు ఐఎస్‌ఎస్‌లో గడపనున్నారు.
ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనమవుతారు. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా ఈ మిషన్‌ను చేపడుతున్నాయి.