ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సామ్రాట్ రాణా స్వర్ణం నెగ్గాడు. 2025, నవంబరు 10న కైరోలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సామ్రాట్ 243.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. హు కయ్ (చైనా, 243.3) రజతం, భారత షూటర్ వరుణ్ తోమర్ (221.7) కాంస్యం నెగ్గారు. మరోవైపు భారత మహిళల జట్టు 10మీ ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో రజత పతకంతో సత్తాచాటింది.