ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఆర్య బోర్సె, అర్జున్ బబుతా జంట స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2025, జూన్ 14ప మ్యూనిక్‌లో జరిగిన ఫైనల్లో ఆర్య-అర్జున్ జోడీ 17-7తో ఒలింపిక్ ఛాంపియన్లు జిఫీయ్-లిహావో షెంగ్ (చైనా) జంటను ఓడించింది. జెనెట్ హెగ్-హెర్మాన్ (నార్వే) ద్వయం కంచు నెగ్గింది. కాంస్య పోరులో 16-14తో సాజెన్-పీటర్ మాథ్యూ (అమెరికా) జోడీని ఓడించింది.