ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ అమ్మాయి సిఫ్ట్‌కౌర్ సమ్రా స్వర్ణం నెగ్గింది.
2025, ఏప్రిల్ 5న బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో సిఫ్ట్ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
అనిత మాంగోల్డ్ (455.3- జర్మనీ) రెండు, అరినా అల్తుఖోవా (445.9- కజకిస్తాన్) మూడో స్థానాల్లో ఉన్నారు.
ఇదే పోటీల్లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ రజతం నెగ్గింది.
మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో ఇషా 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
చైనా షూటర్ యూజీ న్ (38) స్వర్ణం నెగ్గగా, ఫెంగ్ (చైనా, 30) కాంస్య పతకాన్ని దక్కించుకుంది.