Published on Apr 12, 2025
Current Affairs
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ రెండో స్థానం సాధించింది.

4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు కైవసం చేసుకుంది.

సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా (మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌), రుద్రాంక్ష్ పాటిల్‌ (పురుషుల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌), సురుచి (మహిళల 10 మీ ఎయిర్‌ పిస్టల్‌), విజయ్‌వీర్‌ సిద్ధూ (పురుషుల 25 మీ ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌) భారత్‌కు బంగారు పతకాలు అందించారు.

11 పతకాలతో చైనా (5 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది.