Published on Apr 23, 2025
Current Affairs
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌

లిమా (పెరూ)లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌ ఏడు పతకాలు సాధించింది. అందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. చైనా, అమెరికా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చివరి రోజు (ఏప్రిల్‌ 22) జరిగిన ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో పృథ్వీరాజ్‌ తొండమాన్‌- ప్రగతి దూబె జోడీ అయిదో స్థానంలో నిలిచింది. లక్షయ్‌- నీరూ జంట 13వ స్థానంతో సరిపెట్టుకుంది.