Published on Nov 28, 2025
Admissions
ఐఎంయూలో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎంఎస్‌ ప్రవేశాలు
ఐఎంయూలో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎంఎస్‌ ప్రవేశాలు

ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ) 2025-26 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎంఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, నావిగేషన్‌, మేనేజ్‌మెంట్‌, నావల్‌ ఆర్కిటెక్చర్‌ వంటి విభాగాల్లో పరిశోధన అవకాశలను కల్పిస్తుంది. 

వివరాలు:

పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ అండ్‌ ఎంఎస్‌ (రిసెర్చ్‌) 2026 ప్రోగ్రామ్‌ ప్రవేశాలు

విభాగాలు: 

స్కూల్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, స్కూల్‌ ఆఫ్‌ న్యూట్రికల్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ మ్యారిటైమ్‌ మేనేజ్‌మెంట్‌, స్కూల్‌ ఆఫ్‌ నేవల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌.

ప్రోగ్రాములను అందించే క్యాంపస్‌లు: 

చెన్నై, కోల్‌కతా, ముంబయి, విశాఖపట్నం, కొచ్చి, నవీ ముంబయి, ముంబయి.

అర్హత: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు పీజీ ఉత్తీర్ణత, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎంఎస్‌కు యూజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. నెట్‌/గేట్‌/సీఈఈడీ/క్యాట్‌ అర్హత ఉన్న వారికి రాత పరీక్ష మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 20-12-2025.

Website:https://imu.cbexams.com/phdliveTO2O25/Regprocess.aspx