Published on Nov 12, 2024
Government Jobs
ఐఎఫ్‌జీటీబీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు
ఐఎఫ్‌జీటీబీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ)కి చెందిన కోయంబత్తూరు (తమిళనాడు)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌ (ఐఎఫ్‌జీటీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివ‌రాలు:

1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 08

2. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 01

3. టెక్నీషియన్: 03

4. టెక్నికల్ అసిస్టెంట్: 04

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/ బయోటెక్నాలజీ/ బొటనీ/ఫారెస్ట్రీ/ జూవాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ స్కీల్ టెస్ట్, విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 30-11-2024.

  1. Website:https://ifgtb.icfre.gov.in/