Published on Jun 10, 2025
Government Jobs
ఐఎన్‌సీఓఐఎస్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు
ఐఎన్‌సీఓఐఎస్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ భూశాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీఓఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల్లో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

మొత్తం పోస్టులు: 61

వివరాలు:
 
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్-III: 04

2. ప్రాజెక్ట్ సైంటిస్ట్-II: 16

3. ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 09

4. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 17

5. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 15

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఇంజినీరింగ్, జియోఇన్ఫర్మేటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితరన విభాగాల్లో మాస్టర్స్/ బ్యాచిలర్స్ లేదా తత్సమాన సంబంధిత డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIIకు 45ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్-II 40ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 50ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. 

జీతం: ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIIకు రూ.78,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు  రూ.67,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు రూ.56,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ.20,000, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.18,000. 

ఎంపిక ప్రక్రియ: సైంటిస్టు పోస్టులకు ఇంటర్వ్యూలు, అసిస్టెంట్లలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్షా, ఇంటర్వ్యూ కేంద్రం: హైదరాబాద్. 

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులలకు చివరి తేదీ: 30.06.2025.

Website:https://incois.gov.in/