- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌శీర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు.
- 2025, డిసెంబరు 28న కర్ణాటకలోని కార్వార నౌకాదళ స్థావరానికి నేవీ యూనిఫాంలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. జలాంతర్గామిలో ప్రయాణం ప్రారంభించారు. గంటపాటు ఈ యాత్ర కొనసాగింది.