కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ 2024, డిసెంబరు 18న ‘ఐఎన్‌ఎస్ నిర్దేశక్’ నౌకను జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. హిందు మహాసముద్ర జలాల కచ్చితమైన కొలతలు, సముద్ర సమగ్ర స్వరూప చిత్రాల రూపకల్పన దీనివల్ల సాకారమవుతుందని సంజయ్ సేథ్ తెలిపారు.
సాగర జలాల సరిహద్దులు, రంగులతో కూడిన పటాలను రూపొందించడం, నావిగేషన్ విధానంలో సముద్ర స్వరూప చిత్రపటాలు నిరంతరం నౌకాదళానికి అందజేసేలా దీన్ని రూపొందించారు.