అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తుశిల్ 2024, డిసెంబరు 9న భారత నౌకాదళంలో లాంఛనంగా చేరింది.
రష్యాలోని కలినిన్‌గ్రాడ్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
అధునాతన సాధన సంపత్తి కలిగిన ఈ యుద్ధనౌక హిందూ మహాసముద్రంపై పనిచేయనుంది. ఐఎన్‌ఎస్ తుశిల్‌ను రష్యాలో నిర్మించారు.
ఐఎన్‌ఎస్ తుశిల్ బరువు 3,900 టన్నులు. పొడవు 125 మీటర్లు. ఇందులో భారత పరిజ్ఞానం వాటా 26 శాతం మేర ఉంది. ఈ యుద్ధనౌకలో శక్తిమంతమైన ఆయుధాలు ఉంటాయి.