Published on Nov 25, 2024
Current Affairs
ఐఎన్‌ఎస్‌ తరంగణి
ఐఎన్‌ఎస్‌ తరంగణి

భారత నౌకాదళంలోని తెరచాప శిక్షణ నౌక ఐఎన్‌ఎస్‌ తరంగణి.. ఇటలీ తెరచాప నౌక అమెరిగో వెస్‌పకీతో కలసి సాగరయానం చేసింది.

కేరళలోని కొచ్చి తీరానికి చేరువలో ఈ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ సముద్రయాన సంప్రదాయాలు, భాగస్వామ్యాల పట్ల తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని భారతనౌకాదళం తెలిపింది.

ఇరు దేశాల దళాల మధ్య శిక్షణ, సమన్వయం, మైత్రిని పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.