భారత తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కల్వరి 57వ వార్షికోత్సవాన్ని 2024, డిసెంబరు 8న విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు.
1967 డిసెంబరు 8న ఐఎన్‌ఎస్ కల్వరిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్కే బీచ్‌లోని కురుసురా జలాంతర్గామి మ్యూజియం ప్రాంగణంలో ఛాయాచిత్ర, యుద్ధపరికరాల నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.