Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 2, 2026
Current Affairs
ఐఎండీ వార్షిక నివేదిక
ఐఎండీ వార్షిక నివేదిక
  • దేశంలో గతేడాది (2025)లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించిన వాతావరణ నివేదికను 2026, జనవరి 1న విడుదల చేసింది. 1901లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించిన తర్వాత 2025.. ఎనిమిదో వేడి సంవత్సరంగా నిలిచింది. 
  • 2025 శీతాకాలంలో ఉష్ణోగత్రలు 1.17 డిగ్రీలు, ప్రీ-మాన్‌సూన్‌ (మార్చి-మే)లో 0.29, నైరుతి రుతుపవనాల కాలంలో 0.09 డిగ్రీలు ఎక్కువగా, పోస్ట్‌ మాన్‌సూన్‌ (అక్టోబరు-డిసెంబరు)లో 0.10 డిగ్రీలు తక్కువగా ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.