అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) బోర్డులో భారత్ తరఫున తాత్కాలిక నామినీ డైరెక్టర్‌గా పరమేశ్వరన్ అయ్యర్‌ను ప్రభుత్వం 2025, మే 5న నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మూడేళ్ల పదవీ కాలంలో ఇంకా 6 నెలల మిగిలి ఉండగానే, ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి కేవీ సుబ్రమణియన్‌ను ప్రభుత్వం ఇటీవల తొలగించడంతో ప్రస్తుత నియామకం జరిగింది.